స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (23-10-2016)

(మేన్ రోబో పాఠకులను ఉత్కంఠతో చదివించిన క్షిపణి సీరియల్ ఈ వారంతో అయిపొయింది.అతిత్వరలో మరో డిఫెరెంట్ సీరియల్ తో మీ ముందుకు వస్తారు…చీఫ్ ఎడిటర్)
అగస్త్య బోట్ లోకి దూకగానే బోట్ ఒక్కసారిగా శివమెత్తినట్టు కదిలిపోయింది.
బోట్ తలక్రిందులవ్వకుండా బాలన్స్ చేస్తూ విదిశను పట్టుకున్నాడు.
ఎన్నో జన్మల బంధాన్ని ఎదురుగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి.
మనసులోని మాటకు కళ్ళలో భావం తప్ప అర్థం చెప్పలేని పరిస్థితి.
విదిశకు కూడా పరిస్థితి అలానే ఉంది.
ఎన్నో యుగాలుగా ఎదురుచూసిన వెన్నెల వెలుగై ఎదురుగా ఉంటే ఏం మాట్లాడాలో తెలియని స్థితి.
ప్రమాదపు అంచులలో ఉన్నా ఏ భయం లేకుండా తనకోసమే ఉన్న అగస్త్యను చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలని ఉంది.
శత్రువులు తేరుకునే లోగా హిమాంషు ఇద్దరినీ కవర్ చేస్తూ భూపతి గ్యాంగ్ ను షూట్ చెయ్యడం స్టార్ట్ చేశాడు.
ముందుగా తేరుకున్న అగస్త్య విదిశ చేతులకు ఉన్న కట్లు విప్పేశాడు.
హెలికాప్టర్ లో ఉన్న సాహు అగస్త్య వైపు AK 47 విసిరాడు.
అగస్త్య గన్ అందుకుంటూ ఉండగానే వెనుకవైపు నుండి ఏదో కలకలం బయలుదేరింది
సాహుకు సైగ చేసి బోట్ లో జారాడు.
అగస్త్య తలపై నుండి 2 బుల్లెట్స్ రాసుకుంటూ వెళ్ళాయి.
తలపై నిప్పు కణిక పడ్డట్టు ఫీలింగ్
అగస్త్య సైగను అందుకున్న సాహు హెలికాప్టర్ ను అతని దగ్గరగా తీసుకు వచ్చాడు.
మరోసారి కలకలం అతి సమీపంగా వచ్చింది
చటుక్కున తలవంచి బోట్ లోకి జారుకున్నాడు
మిడతల దండు….
కొన్ని లక్షల మిడతలు తుఫాన్ లా వస్తున్నాయి
దారిలో కనపడ్డ ప్రతి వస్తువును, మనిషిని చుట్టుముడుతూ మందలు మందలుగా వస్తున్నాయి.
చిక్కటి తేనె డ్రమ్ములో బద్రపరచబడి ఉంది. అగస్త్య అడిగిన తక్షణమే తీసుకువచ్చిన డ్రమ్ములు రూమ్ మధ్యలో చక్కగా పేర్చబడి ఉన్నాయి.
అగస్త్య ఆలస్యం కాకుండా చేతిలో ఉన్న AK 47 తో షార్ప్ గా తేనె డ్రమ్ములను షూట్ చేశాడు.
ఒక్కసారిగా తేనె చెల్లాచెదురై భూపతి మనుషులపై వర్షంలా కురిసింది.
స్వచ్చమైన తేనె కావడంతో చిక్కదనం ఎక్కువతో అక్కుడున్న ప్రతి వ్యక్తిపై మందంగా పేరుకుంది.
రానున్న ఆపద గ్రహించిన అగస్త్య సాహుకు వెంటనే సిగ్నల్ ఇచ్చాడు
మిడతల దండు ఒక్కసారిగా భూపతి అతని మనుషులు ఉన్న రూమ్ లోకి వచ్చాయి
ఎదురుగా తేనె కనపడడంతో ఇక ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా అందరిపై అటాక్ చేశాయి.
భూపతి, అతని మనుషులకు ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేకుండా అమాంతం కమ్ముకున్నాయి.
భూపతి, అతని గ్యాంగ్ తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
మిడతలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక్క అంగుళం వదలకుండా కరిచేశాయి.
భూపతితో సహా ఎవ్వరూ గుర్తు పట్టలేనంతగా హతమారిపోయారు.
అస్తిపంజరాలు తప్ప శరీరంపై ఏమీ మిగలలేదు
అగస్త్య సిగ్నల్ ను అందుకున్న సాహు ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ నుండి నిచ్చెన వదిలాడు
అగస్త్య హడావిడిగా విదిశను ఎక్కించి, తాను అందుకున్నాడు
సాహు సైగను అందుకున్న పైలట్ వేగంగా ఆ ప్రదేశం నుండి దూసుకువెళ్ళాడు
****
ఉపసంహారం
అగస్త్య మిషన్ ముగించి తన వద్ద ఉన్న బుక్ ను నందనవర్మ గారికి అందించాడు.
నాగవల్లి దేవాలయంలో ఉన్న సంపదను అగస్త్య విదిశల సహాయంతో దాని వారసులు చేజిక్కించుకున్నారు.
చిరునవ్వు పెదవులపై కదులుతుండగా విదిశ మెళ్ళో అగస్త్య తాళి కట్టాడు
(అయిపొయింది)

NO COMMENTS

LEAVE A REPLY